Skip to content
Hadith TranslationsHadith translations · ترجمة الأحاديث
Hadith · 5821 · తెలుగుSource ↗

నిశ్చయంగా చాలామంది స్త్రీలు తమ భర్తలపై ఫిర్యాదు చేస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలల్ం కుటుంబము వద్దకు వచ్చినారు. ఆ పురుషులు మీలో ఉత్తములు కారు.” - Hadith Translation

ఇయాస్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబూ దుబాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసురాళ్ళను కొట్టకండి”. తరువాత ఉమర్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నారు: “స్త్రీలు తమ భర్తల పట్ల ధైర్యంగా మారారు (భర్తలకు తిరగబడి జవాబిస్తున్నారు)”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దండించడానికి అనుమతించినారు. కానీ తరువాత చాలామంది స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబము వద్దకు వచ్చి తమ భర్తలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయసాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా చాలామంది స్త్రీలు తమ భర్తలపై ఫిర్యాదు చేస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలల్ం కుటుంబము వద్దకు వచ్చినారు. ఆ పురుషులు మీలో ఉత్తములు కారు.”
Narrated by
అబూదావుద్ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
Grade
ప్రామాణికమైన హదీథు

لقد طاف بآل محمد نساء كثير يشكون أزواجهن، ليس أولئك بخياركم

عَنْ إِيَاسِ بْنِ عَبْدِ اللَّهِ بْنِ أَبِي ذُبَابٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا تَضْرِبُوا إِمَاءَ اللَّهِ» فَجَاءَ عُمَرُ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: ذَئِرْنَ النِّسَاءُ عَلَى أَزْوَاجِهِنَّ، فَرَخَّصَ فِي ضَرْبِهِنَّ، فَأَطَافَ بِآلِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نِسَاءٌ كَثِيرٌ يَشْكُونَ أَزْوَاجَهُنَّ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَقَدْ طَافَ بِآلِ مُحَمَّدٍ نِسَاءٌ كَثِيرٌ يَشْكُونَ أَزْوَاجَهُنَّ، لَيْسَ أُولَئِكَ بِخِيَارِكُمْ».

رواه أبو داود وابن ماجه · صحيح

النص العربي والتخريج وجميع الترجمات

Other languages